బెంగళూరు: తమ పార్టీలో తీవ్ర అసమ్మతి ఏమీ లేదంటూ సమర్థించుకునేందుకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రయత్నించారు. సిద్ధ రామయ్య ప్రభుత్వం రెండున్నరేళ్లు మించి ఉండదని, తర్వాత శివకుమార్ సీఎం అవుతారంటూ సొంత పార్టీ నేత ఒక పక్క ఆరోపణలు చేస్తుండగా అలాంటిదేమీ లేదంటూ సిద్ధరామయ్య పేర్కొన్నారు. పైగా ‘ఆపరేషన్ కమలం’ పేరుతో తన ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఆరోపిస్తూ.. అలాంటి ప్రయత్నాలు వృథాయేనని శనివారం మీడియాకు స్పష్టం చేశారు.