బెంగళూరు : కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్య కేసులో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్పపై ఎఫ్ఐఆర్ నమోదైంది వాస్తవమేని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అంతా సేకరించానని సీఎం పేర్కొన్నారు. ఈశ్వరప్ప మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు వార్తలు వస్తున్నాయని సీఎంను విలేకరులు ప్రశ్నించారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ఈశ్వరప్ప రాజీనామా గురించి తనకేమీ తెలియదన్నారు. ఈశ్వరప్ప తనతో నేరుగా మాట్లాడినప్పుడే ఈ అంశాలపై స్పష్టత వస్తుందని సీఎం బసవరాజ్ పేర్కొన్నారు.
ర్ణాటకలో కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్య కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. తన ఆత్మహత్యకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప 40 శాతం కమీషన్ డిమాండ్ చేశారంటూ తన సూసైడ్‌లో లేఖలో సంతోష్ పాటిల్ పేర్కొన్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో సంతోష్ పాటిల్ సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో మంత్రి ఈశ్వరప్పతో పాటు ఆయన మద్దతుదారులు బసవరాజ్, రమేశ్ పేర్లను కూడా చేర్చారు. అయితే ఈ కేసును పారదర్శకంగా దర్యాప్తు చేయాలని పోలీసులను కర్ణాటక ముఖ్యమంత్రి ఆదేశించారు.