ముడా స్కామ్‌లో సిద్ధూ విచారణ
ముడా స్థలాల కేటాయింపు కుంభకోణంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను లోకాయుక్త పోలీసులు బుధవారం విచారించారు. ఈ కేసులో సిద్ధరామయ్య ఏ1గా ఉన్నారు.
- రెండు గంటలపాటు ప్రశ్నించిన లోకాయుక్త పోలీసులు..
- అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పా: సిద్ధరామయ్య
మైసూరు, నవంబర్ 6: ముడా స్థలాల కేటాయింపు కుంభకోణంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను లోకాయుక్త పోలీసులు బుధవారం విచారించారు. ఈ కేసులో సిద్ధరామయ్య ఏ1గా ఉన్నారు. లోకాయుక్త పోలీసులు ఇచ్చిన నోటీసుల మేరకు బుధవారం ఆయన విచారణకు హాజరయ్యారు. లోకాయుక్త ఎస్పీ టీజే ఉదేశ్ నేతృత్వంలోని అధికారుల బృందం సిద్ధరామయ్యను రెండు గంటల పాటు విచారించింది. ముడా స్థలాల కేటాయింపులో ఉన్న ఆరోపణలపై ప్రశ్నించింది. తన భార్య పార్వతికి 14 విలువైన స్థలాలను మైసూరు అర్బన్ డెవెలప్మెంట్ అథారిటీ(ముడా) కేటాయించడంలో సిద్ధరామయ్య పాత్రపై ప్రశ్నించినట్టు తెలుస్తున్నది. కాగా, ఈ కేసులో నిందితులుగా ఉన్న సిద్ధరామయ్య సతీమణి పార్వతి, ఆమె సోదరుడు మల్లికార్జున స్వామితో పాటు దేవరాజు అనే వ్యక్తిని ఇప్పటికే లోకాయుక్త పోలీసులు విచారించారు. మైసూరు సమీపంలోని ఓ గ్రామంలో దేవరాజు నుంచి మల్లికార్జున స్వామి భూమిని కొనుగోలు చేసి పార్వతికి బహుమతిగా ఇచ్చారని, తక్కువ విలువైన ఈ భూమిని ముడాకు అప్పగించి, ఖరీదైన 14 స్థలాలను పార్వతి పొందారనే ఆరోపణలతో ఈ కేసు నమోదైంది. కాగా, అసలు ముడాకు అప్పగించిన స్థలం దేవరాజుది కాదని, మల్లికార్జున స్వామి ఈ స్థలాన్ని కొనలేదనే ఆరోపణలు సైతం ఉన్నాయి.
నాపై తప్పుడు కేసు పెట్టారు: సిద్ధరామయ్య
లోకాయుక్త పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకూ సమాధానాలు చెప్పానని సిద్ధరామయ్య పేర్కొన్నారు. విచారణ అనంతరం ఆయన మాట్లాడుతూ… ‘ప్రతీది(ముడా స్థల కేటాయింపు) న్యాయబద్ధంగా జరిగింది. బీజేపీ, జేడీఎస్ అబద్ధపు ఆరోపణలు చేస్తున్నాయి. లోకాయుక్త పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాను. నాపై తప్పుడు కేసు పెట్టారు. నేను నిజాలు చెప్పాను. నాపై ఉన్నవి ఆరోపణలు మాత్రమే.’ అని పేర్కొన్నారు.
సిద్ధరామయ్య రాజీనామా కోసం ఆందోళన
సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం బీజేపీ నేతలు మైసూరులో ఆందోళనకు దిగారు. బీజేపీ ఎమ్మెల్యే టీఎస్ శ్రీవత్స నేతృత్వంలో బీజేపీ శ్రేణులు సిద్ధరామయ్య, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించి, నినాదాలు చేశారు. సిద్ధరామయ్య సీఎం పదవికి రాజీనామా చేసి, విచారణను ఎదుర్కోవాలని శ్రీవత్స డిమాండ్ చేశారు. ఆయన సీఎంగా ఉంటే విచారణ పారదర్శకంగా ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. లోకాయుక్త పోలీసుల తీరుపై అనుమానం వ్యక్తం చేసిన ఆయన ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
Raipur man jailed in Russia | ఉద్యోగం కోసం రష్యా వెళ్లిన వ్యక్తి.. డ్రగ్స్ కేసులో అరెస్ట్, ఆర్మీలో చేరాలని ఒత్తిడి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

