బెంగళూరు : కొత్త ప్రభుత్వాధినేతగా ప్రమాణం చేసేందుకు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నవంబర్లో ముహూర్తం ఖరారు చేసినట్లు సాగుతున్న ఊహాగానాలపై వ్యాఖ్యానించవలసిందిగా విలేకరులు శుక్రవారం కోరినపుడు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంయమనం కోల్పోయారు.
ముఖ్యమంత్రిగా నవంబర్ 21 లేదా 26న డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు స్థానిక మీడియా కథనాల గురించి విధాన సౌధలో విలేకరులు ప్రస్తావించగా సిద్ధరామయ్యలో కోపం కట్టలు తెంచుకుంది. ఎవరు చెప్పారు మీకు? ఈ విషయం శివకుమార్ మీకు చెప్పారా? అంటూ ఆయన విసురుగా నడుచుకుంటూ వెళ్లిపోయారు.