బెంగళూరు: నిరుడు బెంగళూరులో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఒక ఓటర్ రెండుసార్లు ఓటేసినట్టు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై కర్ణాటక ముఖ్య ఎన్నికల అధికారి(సీఈఓ) స్పందించారు. ఆ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను తమకు సమర్పించాలని కోరారు.
శకున్ రాణి అనే ఓటర్ రెండుసార్లు ఓటు వేశారని.. పోలింగ్ కేంద్రం అధికారి ఇందుకు సంబంధించి రెండుసార్లు టిక్ మార్క్ పెట్టారని రాహుల్ ఇటీవల ఆరోపించారు. అయితే తమ విచారణలో ఆమె ఒకసారే ఓటు వేసినట్టు తేలిందని.. ప్రాథమిక విచారణ ప్రకారం రాహుల్ గాంధీ చూపిన టిక్ మార్క్ పత్రం పోలింగ్ అధికారి జారీ చేసింది కాదని ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది.