Karnataka | బెంగళూరు, మార్చి 9 : కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్లో అభివృద్ధి మాట దేవుడెరుగు.. అయిదింట నాలుగువంతులు గ్యారెంటీల అమలు, సిబ్బంది జీతాలు, రుణ బకాయిలు, సబ్సిడీల చెల్లింపులకే సరిపోతున్నది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం బడ్జెట్ అంచనా వ్యయం రూ.4.09 లక్షల కోట్లు కాగా, అందులో 78 శాతం లేదా, రూ.3.21 లక్షల కోట్లు ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాల అమలుకే ఖర్చు చేయాల్సి ఉంది.
ఈ ఏడాది మూలధన వ్యయం 27 శాతం పెంచి రూ.71,336 కోట్లుగా నిర్ణయించగా, అది చాలని పరిస్థితులు ఏర్పడ్డాయి. కట్టుబడిన వాగ్దానాలు నెరవేర్చడానికి ఖర్చు చేయడం తప్ప వాటిని తగ్గించలేమని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆర్థిక సలహాదారు బసవరాజు రాయరెడ్డి వ్యాఖ్యానించారు.