బెంగళూరు, సెప్టెంబర్ 14: ఓ కాంట్రాక్టర్‌ను కులం పేరుతో దూషించి, చంపేస్తానని హెచ్చరించిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేను పోలీసులు అరెస్టు చేశారు. రాజరాజేశ్వరి నగర్ ఎమ్మెల్యే మునిరత్న తనను దూషించారని, బెదిరించారని కాంట్రాక్టర్ చెల్వరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను ఎమ్మెల్యే లంచం కోసం వేధిస్తున్నాడని ఆయన ఆరోపించారు.
ఈ మేరకు మీడియా ముందు ఒక ఆడియో రికార్డింగ్‌ను బయటపెట్టారు. దీంతో కులం పేరుతో దూషించినందుకు, బెదిరించినందుకు ఎమ్మెల్యేపై పోలీసులు కేసులు నమోదు చేశారు. శనివారం ఎమ్మెల్యేను పోలీసులు అరెస్టు చేశారు. కాగా, ఈ ఆరోపణలపై ఐదు రోజుల్లో వివరణ ఇవ్వాలని మునిరత్నకు కర్ణాటక బీజేపీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.