BJP’s Preetham Gowda | వాళ్లను దేవుడే కాపాడాలి.. ఓటేయలేదంటూ ముస్లింలకు కర్ణాటక బీజేపీ నేత బెదిరింపులు
కర్నాటక ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని బీజేపీ నేత ఓ వర్గం ఓటర్లు తనకు ఓటు వేయలేదంటూ అక్కసు వెళ్లగక్కారు. తానేంటో వారికి చూపిస్తానని బహిరంగంగానే హెచ్చరించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
BJP’s Preetham Gowda | (స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): కర్నాటక ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని బీజేపీ నేత ఓ వర్గం ఓటర్లు తనకు ఓటు వేయలేదంటూ అక్కసు వెళ్లగక్కారు. తానేంటో వారికి చూపిస్తానని బహిరంగంగానే హెచ్చరించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. హసన్ బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రీతం గౌడ జేడీఎస్ అభ్యర్థి హెచ్పీ స్వరూప్ చేతిలో ఓడిపోయారు.
ఓటమి భరించలేని ప్రీతం గౌడ.. తన ఓటమికి ముస్లింలే కారణమని పరోక్షంగా పేర్కొంటూ, వారు తనకు ఓటేయలేదని చిందులు తొక్కారు. తానేంటో, తన శక్తి ఏంటో చూపిస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. రానున్న రోజుల్లో వారిని దేవుడే రక్షించాలని, తన పవరేంటో చూపిస్తానంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రీతం గౌడ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. గత డిసెంబర్లో ఓ వివాదాస్పద వీడియో దుమారం లేపింది. ఆ వీడియోలో ప్రీతం గౌడ ముస్లింలను ఉద్దేశించి మాట్లాడుతూ తనకు ఓటేయకపోతే, వారికి ఏ పనీ చేయనని హెచ్చరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

