Karnataka | జాతీయ పతాకంపై కర్నాటక బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు!
బీజేపీ నేత, కర్నాటక మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్‌లో కాషాయ జెండా దేశానికి జాతీయ జెండాగా మారుతుందని వ్యాఖ్యానించారు. త్యాగానికి కాషాయ జెండా చిహ్నమని అన్నారు.
బెంగళూర్ : బీజేపీ నేత, కర్నాటక మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్‌లో కాషాయ జెండా దేశానికి జాతీయ జెండాగా మారుతుందని వ్యాఖ్యానించారు. త్యాగానికి కాషాయ జెండా చిహ్నమని అన్నారు. ఈ దేశంలో ఎప్పటినుంచో కాషాయ జెండాకు గౌరవం ఉందని, వేల సంవత్సరాలుగా కాషాయ జెండా త్యాగానికి సంకేతంగా నిలిచిందని చెప్పారు.
ఆరెస్సెస్‌లో కాషాయ జెండా ముందు నిలుచుని ఆ విలువలు తమలో నిండాలని కోరుకునేవారమని అన్నారు. రేపోమాపో ఏదో ఒకరోజు కాషాయ పతాకం జాతీయ పతాకంగా నిలుస్తుందని..ఇందులో ఎలాంటి సందేహం లేదని ఆయన పేర్కొన్నారు. మన రాజ్యాంగం ప్రకారం మూడు రంగుల జెండా మన జాతీయ పతాకమని, దానికి ఎలాంటి గౌరవం ఇవ్వాలో అంతవరకూ ఇస్తామని చెప్పారు.
కాగా, మంత్రి ఈశ్వరప్ప తనను ముడుపులు డిమాండ్ చేశాడని ఆరోపించిన కాంట్రాక్టర్ మరణించిన ఉదంతంలో ఈశ్వరప్పను క్యాబినెట్ నుంచి తప్పించారు. ఇక గతంలోనూ ఈశ్వరప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాము ఎర్రకోట సహా ప్రతిచోటా కాషాయ జెండాను ఎగురవేస్తామని, భారత్ త్వరలోనే హిందూ దేశంగా అవతరిస్తుందని ఫిబ్రవరి 9న ఆయన అన్నారు. ఈశ్వరప్ప వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. అసెంబ్లీ లోపల వెలుపల పెద్ద ఎత్తున నిరసన తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

