బెంగళూరు: కర్ణాటక మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్‌ను దుర్భాషలాడి అరెస్టైన బీజేపీ ఎమ్మెల్సీ సీటీ రవికి (BJP leader CT Ravi) కర్ణాటక హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆయన పట్ల పోలీసుల ప్రవర్తనను కోర్టు తప్పుపట్టింది. తలకు గాయం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సీటీ స్కాన్ చేయించుకోవాలని బెల్గామ్‌లోని ఓ డాక్టర్ సిఫారసు చేసినట్లు బెయిల్ ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే బీజేపీ నేత సీటీ రవి దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై నిర్ణయాన్ని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు శనివారానికి రిజర్వ్ చేసింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక కోర్టు తీర్పుతో సంబంధం లేకుండా హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
కాగా, కర్ణాటక ప్రభుత్వం తనను చంపేందుకు ప్రయత్నిస్తోందని సీటీ రవి ఆరోపించారు. బెలగావిలోని సువర్ణ విధాన సౌధ నుంచి నాటకీయంగా పోలీసులు అరెస్టు చేసిన తరువాత పలు చోట్లకు తరలించినట్లు విమర్శించారు. మొదట ఖానాపూర్ పోలీస్ స్టేషన్‌కు, ఆ తర్వాత రామ్ దుర్గా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లినట్లు తెలిపారు.
మరోవైపు గురువారం రాత్రంతా తనను పలు జిల్లాల్లో పోలీసులు తిప్పినట్లు సీటీ రవి ఆరోపించారు. శుక్రవారం ఉదయం ఫ్రెష్ అప్ అయ్యేందుకు రిసార్ట్‌కి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. ఉదయం10 గంటలకు వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి, ఆ తర్వాత బెలగావి కోర్టులో హాజరుపర్చినట్లు చెప్పారు. అనంతరం తనను బెంగళూరు తరలించినట్లు ఆయన వెల్లడించారు. సీటీ రవితోపాటు బీజేపీ నేతల ఆరోపణలకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
BJP leader and former Karnataka minister @CTRavi_BJP alleges not giving him even first aid for 3 hours despite receiving severe head injuries and making him travel in police van for 5 hours at deserted places.
Just now, after whole night of trauma, Police has taken a counter… pic.twitter.com/M8E0jRtrA6
— Megh Updates 🚨™ (@MeghUpdates) December 20, 2024