బెంగళూరు: తేజస్ వంటి ఫైటర్ జెట్స్, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను తయారుచేసే కేంద్ర సంస్థ ‘హిందుస్తాన్ ఎరోనాటికల్ లిమిటెడ్’ (హెచ్ఏఎల్)పై కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తున్నది. ఇటీవలి ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు, ‘నూతన గ్రీన్‌ఫీల్డ్ హెచ్ఏఎల్’ యూనిట్‌ను ఏపీలో ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదనను కేంద్రం, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముందు ఉంచారని తెలిసింది.
ఏపీ-కర్ణాటక సరిహద్దులోని లేపాక్షి వద్ద 10వేల ఎకరాలు కేటాయించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు ఏపీ సీఎం కేంద్రానికి తెలిపారట. కాగా ఈ వార్తల్ని కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కార్ ఖండించింది. హెచ్ఏఎల్ను ఏపీకి తరలిస్తారన్న వార్తల్ని తోసిపుచ్చింది. దీనిపై కేంద్రంలోని మోదీ సర్కార్ మాత్రం నోరు మెదపటం లేదు.