Karnataka govt : బెంగళూరు (Bengalore) లోని చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy stadium) వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాట (Stampede) పై కర్ణాటక ప్రభుత్వం (Karnataka govt) స్పందించింది. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. తొక్కిసలాటలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం (Deputy CM) డీకే శివకుమార్ (DK Shivakumar) క్షమాపణలు చెప్పారు. ఆర్సీబీ అభిమానులు బారీగా తరలిరావడంతో అదుపు చేయలేకపోయామని, వైఫల్యం తమదేనని ఆయన చెప్పారు.
మరోవైపు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య క్షతగాత్రులు చికిత్స పొందుతున్న బౌరింగ్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. బాధిలందరికీ సరైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. కాగా ఐపీఎల్-2025 కప్పు గెలిచిన ఆర్సీబీ ఆటగాళ్లు ఇవాళ బెంగళూరుకు చేరుకున్నారు. దాంతో కర్ణాటక క్రికెట్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో వారికి సన్మానం చేసేందుకు చిన్నస్వామి స్టేడియంలో ఏర్పాట్లు చేశారు.
ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొనేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దాంతో వారిని అదుపుచేయడం అక్కడున్న పోలీసులకు సాధ్యంకాలేదు. అభిమానులు బారీకేడ్లను తోసుకుని స్టేడియంలోకి పరుగులు తీశారు. దాంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలో ఆరుగురు మరణించారు. దాదాపు 50 మంది గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.