న్యూఢిల్లీ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Womens Day) సందర్భంగా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికల ద్వారా తమ అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. సారా అలీ ఖాన్ ఈ రోజును తన తల్లి అమృతా సింగ్‌కు డెడికేట్ చేయగా, కరీనా కపూర్ ప్రతి ఒక్కరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందచేశారు.
జాకీ ష్రాఫ్ తన దివంగత తల్లితో కలిసిఉన్న ఫొటోను షేర్ చేశారు. తన భార్య ఆయేషా ష్రాఫ్, కూతురు కృష్ణ ష్రాఫ్‌లతో కలిసిఉన్న ఫొటోలనూ ఆయన షేర్ చేశారు. ప్రతి రోజూ మహిళా దినోత్సవమే..అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు అని కరీనా కపూర్ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. బాలీవుడ్ భామ భూమి పెడ్నేకర్ మగువలందరికీ మీరే ది బెస్ట్ అంటూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Read More :
Womens Day | మహిళల అభ్యున్నతి కోసం కృషి చేద్దాం : మంత్రి హరీశ్‌రావు
Women’s day | మహిళా దేవోభవ.. ‘ఆమె’కు అండగా కేసీఆర్ సర్కారు