న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ విజయం సాధించారు. ఆయనకు 1,066 ఓట్లు లభించగా, ఆయన ప్రత్యర్థి సీనియర్ అడ్వకేట్ ప్రదీప్ రాయ్కి 689 ఓట్లు వచ్చాయి. ప్రస్తుత అధ్యక్షుడు సీనియర్ అడ్వకేట్ డాక్టర్ అదిష్ సీ అగర్వాలాకు 296 ఓట్లు లభించాయి. ఈ పదవిని సిబల్ చేపట్టడం ఇది నాలుగోసారి