బెంగళూరు, జూలై 17: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యా రావుకు ఏడాదిపాటు జైలు శిక్ష విధిస్తూ అడ్వైజరీ బోర్డ్ ఉత్తర్వులు జారీచేసింది. విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ కార్యకలాపాల నివారణ చట్టం (సీవోఎఫ్ఈపీవోఎస్ఏ) కింద అడ్వైజరీ బోర్టు ఈ ఉత్తర్వులను జారీచేసింది. అంతేగాక బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే హక్కును బోర్డు పరిమితం చేసింది.
రన్యా రావు ఈ ఏడాది మార్చి 3న దుబాయ్ నుంచి వస్తూ బెంగళూరులోని విమానాశ్రయంలో రూ.12.56 కోట్ల విలువజేసే 15 కిలోల అక్రమ బంగారంతో కస్టమ్స్ అధికారులకు పట్టుబడింది. అనంతరం ఆమెను విమానాశ్రయ అధికారులు అరెస్టు చేశారు.