బెంగళూరు: కన్నడ నటుడు ఉపేంద్ర దళితులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ పార్టీ ‘ప్రజాకీయ’ గురించి మాట్లాడుతూ ‘కొంత మంది ఇష్టానుసారం, వారి మైండ్‌కు తోచినట్టుగా మాట్లాడుతారు. ఇప్పుడు ఒక పట్టణం ఉందనుకోండి..
అందులో అనివార్యంగా దళితులు కూడా ఉంటారు’ అని అన్నారు. ఉపేంద్రపై బెంగళూరులో కేసు నమోదైంది. విమర్శలు రావడంతో ఉపేంద్ర తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు.