Kanjhawala death case | పోలీసుల ముందు లొంగిపోయిన ఏడో నిందితుడు అంకుశ్
Kanjhawala death case | దేశ రాజధాని ఢిల్లీలోని కంఝావాలా ఏరియాలో అంజలి అనే యువతిని కారుతో ఢీకొట్టి 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ఘటనలో అరెస్టుల పర్వం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని కంఝావాలా ఏరియాలో అంజలి అనే యువతిని కారుతో ఢీకొట్టి 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ఘటనలో అరెస్టుల పర్వం కొనసాగుతున్నది. ఇప్పటికే ఈ కేసులో ఆరుగురు అరెస్టు కాగా, తాజాగా అంకుశ్ అనే మరో నిందితుడు పోలీసుల ముందు లొంగిపోయాడు. ఘటన జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్న అంకుశ్ అనే నిందితుడు.. ఇవాళ సాయంత్రం సుల్తాన్‌పురి పోలీస్‌స్టేషన్‌లో సరెండర్ అయ్యాడు.
దాంతో పోలీసులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. అంకుశ్తో కలిపి ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన నిందితుల సంఖ్య ఏడుకు చేరింది. ఇవాళ ఉదయమే అశుతోష్ అనే మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. పోలీసులు విజ్ఞప్తి మేరకు కోర్టు అతనికి మూడు రోజుల పోలీస్ కస్టడీ విధించింది.
కాగా, జనవరి 1న అర్ధరాత్రి 1.45 గంటలకు అంజలి అనే యువతి తన స్నేహితురాలు నిధితో కలిసి స్కూటీపై వెళ్తుండగా స్పీడ్‌గా వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నింది పక్కకు పడిపోగా.. అంజలి కారు కింద ఇరుక్కుపోయింది. అయినా నిందితులు కారును ఆపకుండా ఆమెను అలాగే 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి అంజలి ప్రాణాలు విడిచింది.
Delhi | Seventh accused in the Kanjhawala death case, Ankush surrenders before Police. Visuals from Sultanpuri Police Station. pic.twitter.com/FppccoiQ1N
— ANI (@ANI) January 6, 2023
#UPDATE | Kanjhawala death case | Delhi’s Rohini Court sends sixth accused, Ashutosh to 3-day Police custody.
Visuals of him being brought out of Delhi’s Rohini Court. pic.twitter.com/aZMLNOXkvU
— ANI (@ANI) January 6, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

