Kangra Accident | హిమాచల్ ప్రదేశ్‌లో బస్సు బోల్తా.. 26 మందికి గాయాలు.. డ్రైవర్‌కు గుండెపోటే కారణం..?
Kangra Accident : హిమాచల్ ప్రదేశ్‌లోని కంగ్రాలో ఆదివారం బస్సు ప్రమాదం జరిగింది. బస్సు బోల్తా పడిన ఘటనలో 26 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
Kangra Accident : హిమాచల్ ప్రదేశ్‌లోని కంగ్రాలో ఆదివారం బస్సు ప్రమాదం జరిగింది. బస్సు బోల్తా పడిన ఘటనలో 26 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని కంగ్రా జిల్లాలో జరిగింది. ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు 40 మంది ప్రయాణికులతో చంబా నుంచి ఉనా వెళ్తోంది. ఈ క్రమంలో నుర్పూర్ సమీపంలోని నియాజ్పూర్ వద్ద బస్సు బోల్తా పడింది.
ఈ ఘటనలో బస్సులోని ప్రయాణికుల్లో 26 మందికిపైగా గాయపడ్డట్లు తెలుస్తోంది. బస్సు డ్రైవర్ గుండె పోటుకు గురికావడం, ఈ సమయంలో బస్సును నియంత్రించలేకపోవడం వల్లే బోల్తాపడి ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక అంచనా. బస్సు అదుపుతప్పుతున్న సమయంలోనే కొందరు ప్రయాణికులు గమనించి తమను తాము రక్షించుకునేందుకు అప్రమత్తమయ్యారు. బస్సు బోల్తా పడినే వెంటనే స్థానికులు స్పందించారు. అధికారులకు వెంటనే సమాచారం అందించారు. వెంటనే అధికారులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకుపోయిన ప్రయాణికుల్ని బయటకు తీశారు.
గాయపడ్డవారిని నుర్పూర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారికి చికిత్స అందుతోంది. ఈ 26 మందిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని, వారిని మెరుగైన చికిత్సకోసం టాండా మెడికల్ కాలేజీకి పంపించినట్లు వైద్యులు తెలిపారు. మిగతా వారికి గాయాలైనప్పటికీ, ప్రాణాపాయం లేదని తెలిపారు. నుర్పూర్ ఎస్పీ ఆధ్వర్యంలోని పోలీసుల బృందం ఈ ఘటనపై విచారణ జరుపుతోంది. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తామని అధికారులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

