Loksabha Elections 2024 : మండి లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్ధిగా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నామినేషన్ దాఖలు చేశారు. మండి ప్రజల ప్రేమానురాగాలే తనను ఇక్కడికి రప్పించాయని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. కంగనా వెంట ఆమె తల్లి, సోదరి ఉన్నారు.
సినిమాల్లో రాణించిన తరహాలోనే రాజకీయాలపైనా తనదైన ముద్ర వేస్తానని కంగనా రనౌత్ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో అన్ని రంగాల్లో మహిళలు సత్తా చాటుతున్నారని, మండి మహిళలు సైన్యం, విద్యా, రాజకీయాల్లో రాణిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశ వ్యతిరేక వైఖరితో ముందుకెళ్లడం ఆందోళన రేకెత్తిస్తోందని చెప్పారు.
ఇక కంగనాకు మద్దతుగా ప్రజలు తరలివస్తున్నారని, ఇక్కడ తమ విజయం ఖాయమని నటి తల్లి ఆశా రనౌత్ ఆశాభావం వ్యక్తం చేశారు. కంగనా నూతన ప్రస్ధానం సందర్భంగా తాను శుభాకాంక్షలు తెలుపుతున్నానని నామినేషన్ కార్యక్రమానికి హాజరైన ఆమె సోదరి రంగోలి రనౌత్ పేర్కొన్నారు. కంగనా విజయాన్ని ఇక్కడకు హాజరైన భారీ జనసందోహమే వెల్లడిస్తోందని ధీమా వ్యక్తం చేశారు.
Read More :
Flight Journey | 110 రోజులు.. 200 విమానాల్లో ప్రయాణం.. ఎందుకంటే..?