బెంగుళూరు: కర్నాటకలోని కాళీ నదిపై ఉన్న పాత బ్రిడ్జ్(Kali River bridge) కూలింది. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. దీంతో జాతీయ రహదారి 66పై భారీగా ట్రాఫిక్ జామైంది. గోవా, కర్నాటక మధ్య .. ఈ బ్రిడ్జ్ కీలక వారధిగా ఇన్నాళ్లూ కొనసాగింది. బ్రిడ్జ్ కూలిన సమయంలో దాని మీద నుంచి వస్తున్న ఓ ట్రక్కు నది నీటిలో పడిపోయింది. అయితే దాంట్లో ఉన్న డ్రైవర్‌ను స్థానిక జాలర్లు రక్షించారు. కర్నాటకలోని సదాశివగాడ్ వద్ద ఉన్న బ్రిడ్జ్ రాత్రి ఒంటి గంటకు కూలినట్లు తెలుస్తోంది. పాత బ్రిడ్జ్ కూలిన నేపథ్యంలో.. కొత్తగా నిర్మించిన బ్రిడ్జ్‌పై ఇవాళ ఉదయం ట్రాఫిక్‌ను నిలిపివేశారు. భారీ వాహనాలు కాకుండా ఇతర వాహనాలకు అనుమతి ఇచ్చారు.
#KarwarBridgeCollapase Lorry driver Murugan who fell into the river along with his lorry is being rescued by local fishermen and police on Wednesday wee hours in #Karwar old Kali river bridge #WATCH @NewIndianXpress @XpressBengaluru @KannadaPrabha @ns_subhash pic.twitter.com/L2BJ4R1M7s
— Amit Upadhye (@AmitSUpadhye) August 7, 2024
ఉత్తర కన్నడ ప్రాంతంలో భారీ గా వర్షాలు కురుస్తున్నాయి. కొండచరియలు కూడా విరిగిపడ్డాయి. బ్రిడ్జ్‌కు చెందిన కొంత భాగం.. నది నీటిలో పడిపోయింది. రాత్రి పెట్రోలింగ్ నిర్వహించే పోలీసులు ఈ ప్రమాదాన్ని చూశారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
#WATCH | Karnataka: Kali River bridge collapsed near Karwar in Uttara Kannada district.
(Video source – Information department, Karwar. Karnataka) pic.twitter.com/VO7LqH8ipY
— ANI (@ANI) August 7, 2024