న్యూఢిల్లీ: తదుపరి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్)గా కే సంజయ్ మూర్తి నియమితులయ్యారు. ప్రస్తుత కాగ్ గిరీశ్ చంద్ర ముర్ము పదవీ కాలం ఈ నెల 20న ముగుస్తుంది. మూర్తి హిమాచల్ ప్రదేశ్ క్యాడర్ 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం కేంద్ర విద్యా శాఖలో కార్యదర్శిగా ఉన్నారు. మూర్తిని తదుపరి కాగ్గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఆయన పదవీ బాధ్యతలను చేపట్టిననాటి నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుందని పేర్కొన్నది.