లక్నో, సెప్టెంబర్ 24 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై జ్యోతిర్మఠం శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని, రాష్ట్రపతి పదవుల్లో ఇప్పటివరకు హిందువులు లేరని ఆయన లక్నోలో వ్యాఖ్యానించారు. ప్రధాని, రాష్ట్రపతి హిందువులే కదా అని ఓ మీడియా ప్రతినిధి అడిగినప్పుడు.. ‘వారిలో హిందువులు ఎవరు? ఏ రాష్ట్రపతి హిందువు? ఏ ప్రధాని హిందువు? ఒకవేళ వారు హిందువులే అయి ఉంటే వారి హయాంలో గోవధ జరుగుతుండేదా? ఇప్పటివరకు ఈ పదవుల్లో హిందువులు ఎవరూ లేరు. హిం దువు ఈ పదవుల్లో ఉంటే గోవధకు వారి అంతరాత్మ అనుమతించదు. తన పదవికి రాజీనామా చేసే వారు లేదా గోవధ నిషేధమని ఉత్తర్వులు ఇచ్చేవారు’ అని వ్యాఖ్యానించారు.