న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్ మంగళవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి ఆయన నియామకం అమలులోకి వస్తుందని అధికారిక నోటిఫికేషన్ పేర్కొంది.
జస్టిస్ మన్మోహన్‌ను సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం నవంబర్ 28న సిఫార్సు చేయగా రాష్ట్రపతి ఆయనను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్‌గా విభూ బఖ్రూ నియమితులైనట్లు న్యాయశాఖ తెలిపింది.