న్యూఢిల్లీ, జనవరి 16: సుప్రీంకోర్టు జడ్జిగా పట్నా హైకోర్టు సీజే జస్టిస్ కే వినోద్ చంద్రన్ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆయనతో ప్రమాణం చేయించారు.
జస్టిస్ చంద్రన్ నియామకంతో సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య 33కు చేరింది. దేశ అత్యున్నత న్యాయస్థానంలో మొత్తం మంజూరైన పోస్టుల సంఖ్య 34. ఈ నెల 13న కేంద్రం జస్టిస్ చంద్రన్ నియామకానికి ఆమోదం తెలిపింది.