న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ జోయ్మాల్య బాగ్చి సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణం చేయించారు. జస్టిస్ బాగ్చి కలకత్తా హైకోర్టు సీనియర్ జడ్జిగా పని చేశారు. సుప్రీంకోర్టులో మొత్తం 34 మంది న్యాయమూర్తుల నియామకానికి అనుమతి ఉంది. ప్రస్తుతం జస్టిస్ బాగ్చితో కలిపి 33 మంది న్యాయమూర్తులు ఉన్నారు. ఆయన పదవీ కాలం ఆరు సంవత్సరాలకుపైగా ఉంది.