Justice Anupinder Grewal: నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ప్రెసిడెంట్‌గా అనుపిందర్ సింగ్ గ్రేవాల్ నియామకం
Justice Anupinder Grewal : పంజాబ్-హర్యానా హైకోర్టు మాజీ జస్టిస్ అనుపిందర్ సింగ్ గ్రేవాల్.. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ప్రెసిడెంట్‌గా నియమితుడయ్యారు. అయిదేళ్ల కాలపరిమితి కోసం ఆయన్ను నియమించారు. లేదంటే 67 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆయన ఆ పదవిలో కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
న్యూఢిల్లీ:పంజాబ్-హర్యానా హైకోర్టు మాజీ జస్టిస్ అనుపిందర్ సింగ్ గ్రేవాల్(Justice Anupinder Grewal).. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ప్రెసిడెంట్‌గా నియమితుడయ్యారు. అయిదేళ్ల కాలపరిమితి కోసం ఆయన్ను నియమించారు. లేదా 67 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆయన ఆ పదవిలో కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఎన్సీఎల్టీ ప్రెసిడెంట్‌గా జస్టిస్ రామలింగం సుధాకర్ పదవీ కాలం ముగిసిన విషయం తెలిసిందే. 2021, నవంబర్ ఒకటో తేదీ నుంచి రామలింగం ఆ బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ ఏడాది ఆరంభంలో ఆయన ఎన్సీఎల్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు.
జస్టిస్ గ్రేవాల్ 1964, మార్చి 10వ తేదీన జన్మించారు. పంజాబ్‌లోని లుథియానా జిల్లాకు చెందిన వ్యవసాయ కుటుంబంలో ఆయన జన్మించారు. 1992లో ఆయన పంజాబ్-హర్యానా హైకోర్టులో లీగల్ ప్రాక్టీస్ మొదలుపెట్టారు. పంజాబ్ ప్రభుత్వ లా ఆఫీసుల్లో ఆయన అనేక హోదాల్లో పనిచేశారు. 1995 నుంచి 97 వరకు అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్‌గా, 97 నుంచి 2002 వరకు డిప్యూటీ అడ్వకేట్ జనరల్‌గా, 2002 నుంచి 2005 వరకు సీనియర్ డిప్యూటీ అడ్వకేట్ జనరల్‌గా చేశారు. ఆ తర్వాత ఆయన కేంద్ర ప్రభుత్వ కౌన్సిల్‌గా చేశారు.
అనేక కేంద్ర ప్రభుత్వ కేసుల్లో ఆయన వాదించారు. 2014 సెప్టెంబర్ 25వ తేదీన పంజాబ్-హర్యానా హైకోర్టు అదనపు జడ్జీగా ఆయనకు పదోన్నతి దక్కింది. ఆ తర్వాత ఆయన రాజస్థాన్ హైకోర్టుకు వెళ్లారు. 2016 మే నెలలో ఆయన పర్మనెంట్ జడ్జీ అయ్యారు. 2026, మార్చి 10వ తేదీన జడ్జీగా ఆయన రిటైర్ అయ్యారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
Kohli – Renshaw | కోహ్లీకి ఊహించని షాకిచ్చిన ఆసీస్ బ్యాటర్.. చిరస్మరణీయ శతకంతో పదేళ్ల రికార్డు బ్రేక్..!
Bloody Romeo | ఇంకా రచ్చ రచ్చే.. ‘బ్లడీ రోమియో’ కోసం నాని స్టైలిష్ మేకోవర్ చూశారా..?
Muscle Growth | 30 ఏళ్లు దాటిన తరువాత కండరాల నిర్మాణం సాధ్యం కాదా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

