న్యూఢిల్లీ : ఢిల్లీ వాయు కాలుష్య సమస్యను పరిష్కరించడానికి తమ దగ్గర ఎలాంటి మంత్ర దండం లేదని సుప్రీం కోర్ట్ గురువారం వ్యాఖ్యానించింది. ‘ఇది ఢిల్లీ-ఎన్సీఆర్కు ప్రమాదకరమని నాకు తెలుసు. వెంటనే పరిశుభ్రమైన గాలి లభించేందుకు ఏం ఆదేశాలివ్వాలో చెప్పండి’ అని సీజేఐ సూర్యకాంత్ అన్నారు.
ఢిల్లీలో ప్రస్తుత పరిస్థితులు ఆరోగ్య అత్యవసర పరిస్థితిని తలపిస్తున్నాయని సీనియర్ న్యాయవాది అపరాజితా సింగ్ వర్ణించగా.. కోర్టు స్పందిస్తూ ఇలాంటి విషయాలను పరిష్కరించడంలో తమ పరిమితులు తమకు ఉన్నాయంది. ఆయా రంగాల నిపుణులు, శాస్త్రవేత్తలు ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోగలరని తెలిపింది.