JPC Meeting : ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్ (One Nation, One Election)’ బిల్లుపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (Joint Parliamentary committee) వచ్చే నెల 8న తొలిసారి సమావేశం కానుంది. కమిటీ ఛైరపర్సన్తోపాటు సభ్యులు అంతా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సమావేవం అజెండాకు సంబంధించిన వివరాలను కేంద్ర న్యాయ శాఖ కమిటీ సభ్యులకు తెలియజేయనుంది.
జనవరి 8న ఉదయం 11 గంటలకు సమావేశం మొదలుకానుంది. ఈ విషయాన్ని కమిటీ జాయింట్ సెక్రెటరీ గుండా శ్రీనివాసులు ఒక ప్రకటన ద్వారా మీడియాకు వెల్లడించారు. 129వ రాజ్యాంగ సవరణ బిల్లుపై, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లుపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ వచ్చే జనవరి 9న తొలిసారి సమావేశం కానుందని, సభ్యులందరూ సమావేశానికి హాజరు కావాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.