JP Nadda | కేంద్రంలో నరేంద్రమోదీ సారధ్యంలో కొలువు దీరిన క్యాబినెట్ లో ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా చేరారు. ఆదివారం రాష్ట్రపతి భవన్ లో జరిగిన కేంద్ర మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో కేంద్ర మంత్రిగా నడ్డా ప్రమాణం చేశారు. 2014లో తొలిసారి మోదీ మంత్రి వర్గంలో జేపీ నడ్డా ఆరోగ్యశాఖ మంత్రిగా పని చేశారు.
తాజాగా మోదీ క్యాబినెట్ లో మంత్రిగా ప్రమాణం చేశారు. 2020 లో అప్పటి కేంద్ర మంత్రి, బీజేపీ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న అమిత్ షా స్థానంలో జేపీ నడ్డా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. 2022 సెప్టెంబర్ లో మరోమారు పార్టీ అధ్యక్షుడిగా కొనసాగించారు. అంతకుముందు ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణం చేశారు. యూపీ నుంచి రాజ్ నాథ్ సింగ్, గుజరాత్ నుంచి అమిత్ షా, మహారాష్ట్రకు చెందిన నితిన్ గడ్కరీ మంత్రులుగా ప్రమాణం చేశారు.
#WATCH | BJP leader JP Nadda takes oath as a Union Cabinet minister in the Prime Minister Narendra Modi-led NDA government at Rashtrapati Bhavan in Delhi pic.twitter.com/knM5gxYy58
— ANI (@ANI) June 9, 2024