హైదరాబాద్, ఫిబ్రవరి 3 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): అత్యాశలకు పోవడం లేదా సాధ్యంకానటువంటి పనులను ఎవరైనా మీదేసుకొన్న సందర్భాల్లో ‘ఆకాశానికి నిచ్చెన వేయకు’ అని అంటూ ఉంటాం. అయితే, ఇంగ్లండ్‌కు చెందిన జోర్డాన్ విలియమ్ అనే ఆర్కిటెక్ట్ నిజంగానే ఆకాశానికి నిచ్చెన వేయాలనుకొన్నాడు. అంతే, అనుకొన్నదే తడవుగా.. డిజైన్‌ను రూపొందించాడు. దీనికి పారిస్‌లోని ఓ ఫౌండేషన్ 8,617 పౌండ్లను (రూ. 9 లక్షలు) బహుమతిగా అందజేసింది.
రోదసిలో భూదిగువ కక్ష్యలో తిరుగుతున్న ఓ ఆస్టరాయిడ్ నుంచి భూమి మీదకు ఓ కేబుల్‌ను ఏర్పాటు చేసి, దాని సాయంతో పెద్ద పెద్ద డ్రోన్స్ సాయంతో లిఫ్ట్ మాదిరిగా ఉండే గదుల్లో మనుషులను ఆకాశానికి తీసుకువెళ్లొచ్చని విలియమ్ చెబుతున్నాడు. తాను డిజైన్ చేసిన ఈ స్పేస్ ఎలివేటర్‌తో భవిష్యత్తులో భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తు వరకు మనుషులను తీసుకుపోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశాడు.