
న్యూఢిల్లీ, జనవరి 8: వ్యవసాయ రంగంలో జాన్ డీర్ సరికొత్త విప్లవానికి తెరతీసింది. డ్రైవర్ లెస్ ట్రాక్టర్ను తయారు చేసింది. ఈ ట్రాక్టర్ను రైతులు స్మార్ట్ ఫోన్ ద్వారా ఆపరేట్ చేయవచ్చు. జంతువులు, మనుషులు అడ్డం వస్తే ఆటోమేటిక్గా ఆగిపోవడం ఈ ట్రాక్టర్కున్న మరో ప్రత్యేకత. డ్రైవర్ లెస్ ట్రాక్టర్ను జాన్ సంస్థ ఇటీవల లాస్ వేగాస్లో ప్రదర్శనకు పెట్టింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జీపీఎస్ సాయంతో పనిచేస్తుంది. తొలుత 20 ట్రాక్టర్లను అమెరికాలో అందుబాటులోకి తీసుకురావాలని, తర్వాత అమ్మకాలు ప్రారంభించాలని సంస్థ భావిస్తున్నది. అమెరికాలో సంస్థ ఎంపిక చేసిన రైతులు రెండేండ్లుగా దీన్ని పరీక్షిస్తున్నారు. మార్కెట్లో అందుబాటులోకి వచ్చే సరికి ట్రాక్టర్ ధర రూ.37 లక్షల దాకా ఉండొచ్చని అంచనా.