Jnanpith Award | కేంద్ర ప్రభుత్వం శనివారం జ్ఞానపీఠ్ అవార్డులను ప్రకటించింది. ప్రముఖ ఉర్దూ కవి, బాలీవుడ్ సినీ గీత రచయిత గుల్జార్‌ను జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపిక చేసింది. ఆయనతో పాటు సంస్కృత పాండిత్య దిగ్గజం జగద్గురు రామభద్రాచార్యను జ్ఞానపీఠ్ అవార్డుతో సత్కరించింది. గుల్కార్ హిందీ చిత్రాల్లో అనేక హిట్ పాటలకు సాహిత్య అందించారు. ఆయనను 2022లోనే కేంద్రం సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపిక చేసింది. ఆయన 1936 ఆగస్టు 18న ప్రస్తుత పాకిస్థాన్‌లోని జీలం జిల్లా దీనాలో జన్మించారు. గుల్జార్ అనేది ఆయన కలాం పేరు కాగా.. అసలుపేరు సంపూరణ్ సింగ్ కల్రా.
తండ్రి పేరు మఖన్ సింగ్ కల్రా, తల్లిపేరు సుజన్ కౌర్. దేశ విభజన సమయంలో గుల్జార్ కుటుంబం భారత్‌కు వచ్చింది. ఆయన పుఖ్రాజ్, ఏక్ బూంద్ చంద్, చౌరస్ రాత్, రవి పార్, కుచ్ ఔర్ నజ్మాన్, యార్ జులాహే ప్రధాన రచనలు. ముంబైలోని వర్లీలో గుల్జార్ కార్ మెకానిక్‌గా పని చేశారు. సినీ నటి రాఖీని వివాహం చేసుకున్నారు. గుల్జార్ తన తొలి పాట బియల్ రాయ్ చిత్రం బందినిలో ‘మోరా గోరా అంగ్ లై లే’. సద్మా సే ఏ జిందగీ గలే లగా లే, ఆంధీ సే తేరే బినా జిందగీ తదితర ఎన్నో పాటలు రాశారు.
అలాగే ఆనంద్, గుడ్డి, బావర్చి, నమక్ హరామ్, దో దూనీ చార్, ఖామోషి, సఫర్ తదితర కథలు రాశారు. దేశంలోని ప్రముఖ ఉర్దూ కవుల్లో ఒకరిగా పేరుపొందారు. ఆయన కలం నుంచి అనేక ఉర్దూ కవితలు, షాయరీలు జరువారగా.. ఉర్దూ, పంజాబీతో పాటు పలు భాషల్లోనూ అనేక కథలను సైతం రాశారు. అలాగే పలు చిత్రాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. మేరే అప్నే చిత్రాన్ని తొలిసారి నిర్మించారు. ట్రై, మౌసం, ఇజాజత్ చిత్రాలకు మూడు జాతీయ అవార్డులు, 47 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్నారు. 2004లో పద్మభూషణ్, 2013లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు అందుకున్నారు.
జగద్గురు రామభద్రాచార్యకి సైతం కేంద్రం జ్ఞానపీఠ్ అవార్డుకు ఎంపిక చేసింది. పుట్టిన కొద్దిరోజులకే అంధత్వానికి గురైన ఆయన సంస్కృత పాండిత్య దిగ్గజంగా పేరుగాంచారు. రామభద్రాచార్య 1950 జనవరి 14న ఉత్తరప్రదేశ్‌లోని జౌన్పూర్ జిల్లాలో జన్మించారు. రామానంద శాఖకు చెందిన ప్రస్తుత నలుగురు జగద్గురువుల్లో ఒకరు. బాల్యంలోనే అంధత్వానికి గురైన ఆయన దివ్యాంగుల కోసం మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో యూనివర్సిటీని ప్రారంభించారు.
జీవితకాల ఛాన్సెలర్ ఆయనే. ఆయన అసలుపేరు గిరిధర్ మిశ్రా. విశ్వవిద్యాలయం అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు వైకల్యాలున్న విద్యార్థులకు మాత్రమే అందిస్తుంది. రెండు నెలల వయసులోనే అంధత్వం బారినపడ్డారు. అయితే, ఆయన ఇన్నేళ్లలో ఎన్నడూ బ్రెయిలీ లిపిని ఉపయోగించకపోవడం విశేషం. ఆయన బహుభాషావేత్త. ఆయన మొత్తం 100 పుస్తకాలను రక్షించారు.