శ్రీనగర్లో భద్రతా బలగాలపైకి గ్రెనేడ్ విసిరిన ఉగ్రవాదులు
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శ్రీనగర్ నౌహట్టా ప్రాంతంలో ఖ్వాజాబజార్లో శుక్రవారం ఉగ్రవాదులు బలగాలపైకి గ్రెనేడ్ విసిరారు. గ్రెనేడ్ల ధాటికి రెండు దుకాణాలు ధ్వంసమైనట్లు సమాచారం. అయితే, భద్రతా బలగాలతో పాటు సామాన్య పౌరులకు సైతం ఎలాంటి గాయాలు కాలేదు. అయితే, దాడికి సంబంధించి ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు. భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి నిందితుల కోసం గాలిస్తున్నాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. ఇంతకు ముందు ఈ నెల 11న ఉత్తర కశ్మీర్లోని బందిపోరా జిల్లాలోని నిషాత్ పార్క్లోనూ ఉగ్రవాదులు భద్రతా బలగాలపైకి గ్రెనేడ్ విసరడంతో నలుగురు పోలీసులు గాయపడగా.. ఒకరు వీరమరణం పొందారు.
J&K | Terrorists hurled a grenade on security forces at Khwaja Bazar Nowhatta area of Srinagar. Two shops were damaged in the incident. No injury reported pic.twitter.com/A4iF81puzf
— ANI (@ANI) February 18, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

