న్యూఢిల్లీ: జిమ్మీ డొనాల్డ్సన్ అలియాస్ మిస్టర్‌బీస్ట్ యూట్యూబ్‌లో అత్యధిక సబ్ స్ర్కైబర్లు కలిగిన యూట్యూబర్‌గా రికార్డు సృష్టించారు. మ్యూజిక్ కంపెనీ టీ-సిరీస్‌ను అధిగమించి ఆయన చానల్ ఈ ఘనత సాధించింది. అమెరికాకు చెందిన డొనాల్డ్సన్ ఆదివారం ఓ ట్వీట్లో ఈ వివరాలను వెల్లడించారు.
తాజా గణాంకాల ప్రకారం మిస్టర్ బీస్ట్‌కు 26,67,07,995 మంది సబ్‌స్ర్కైబర్లు, టీ-సిరీస్‌కు 26,67,06,387 మంది సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు.