Sita Soren : జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ వదిన, జేఎంఎం ఎమ్మెల్యే సీతా సోరెన్ పార్టీలోని అన్ని పదవులకూ మంగళవారం రాజీనామా చేశారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సీతా సోరెన్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ అన్న దుర్గా సోరెన్ సతీమణి కావడం గమనార్హం.
దుర్గా సోరెన్ 2009లో 39 ఏండ్ల వయసులో మరణించారు. తన భర్త మరణానంతరం తాను, తన కుటుంబాన్ని అగౌరవపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని రాజీనామా లేఖలో సీతా సోరెన్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ సభ్యులు, కుటుంబం తమను వేరు చేసే విధంగా వ్యవహరించడం తనను తీవ్రంగా కలిచివేసిందని ఆమె పేర్కొన్నారు.
కాలంతో పాటు పరిస్ధితులు మారతయాని తాను ఆశించినా తన భర్త విడిచిపెట్టిన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో పార్టీ చొరవ చూపడం లేదని అన్నారు. తమ ఆశయాలు, సిద్ధాంతాలతో సరిపడని వారి చేతిలో ఇప్పుడు పార్టీ బందీగా మారిందని దుయ్యబట్టారు. తనకు, తన కుటుంబానికి వ్యతిరేకంగా భారీ కుట్ర జరుగుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
Read More :
IT Raids | చట్నీస్ హోటల్స్పై ఐటీ దాడులు.. యజమాని ఇండ్లలోనూ సోదాలు