రాంచీ: ప్రభుత్వ ఆసుపత్రి కారిడార్ కూలిపోయింది. (Hospital Roof Collapses) ఈ సంఘటనలో ముగ్గురు రోగులు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించారు. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో మహాత్మా గాంధీ మెమోరియల్ ఆసుపత్రిలోని రెండో అంతస్తులో శిథిలావస్థకు చేరిన కారిడార్ కూలిపోయింది. దీంతో అక్కడున్న రోగుల్లో ముగ్గురు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. శిథిలాల కింద 15 మంది చిక్కుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టి 12 మందిని రక్షించారు.
కాగా, ఈ సంఘటనకు ముందు రోజు ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో ఒక బ్లాక్‌లోని రోగులను శిథిలావస్థలో ఉన్న రెండో అంతస్తులోకి తరలించారు. శనివారం అక్కడి బాల్కానీలో కొందరిని ఉంచారు. అది కుప్పకూలి ముగ్గురు రోగులు మరణించడంతో విమర్శలు వెల్లువెత్తాయి. శిథిలావస్థకు చేరిన చోట రోగులను ఎందుకు ఉంచారని వారి బంధువులు నిలదీశారు. అయితే మరమ్మతుల తర్వాత వినియోగానికి కాంట్రాక్టర్ అనుమతి ఇవ్వడంతో రోగులను అక్కడకు తరలించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
#Jamshedpur में बड़ा हादसा, MGM College की बिल्डिंग गिरी — #Jharkhand के कोल्हान क्षेत्र के सबसे बड़े सरकारी अस्पताल MGM हॉस्पिटल, जमशेदपुर में भयंकर हादसा—बी-ब्लॉक की दीवार और छत भरभरा कर गिर गई।
मलबे में एक महिला समेत कई मरीज दब गए, जिनकी हालत गंभीर बताई जा रही है।
अब ज़रा… pic.twitter.com/R78vc1ttUj
— 𝐑𝐚𝐡𝐮𝐥 𝐊𝐮𝐦𝐚𝐫 (@Rahulk123d) May 3, 2025