జైపూర్: జార్ఖండ్లో మొదటి విడతలో భాగంగా బుధవారం 43 స్థానాలకు ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. రాత్రి 10 గంటల సమయానికి 65 శాతం ఓటింగ్ నమోదైంది. తొలి దశలో మాజీ సీఎం చంపయీ సొరేన్, మాజీ సీఎం మధు కోడా భార్య, మాజీ ఎంపీ గీతా కోడా సహా 683 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
ఈ నెల 20న రెండో విడత పోలింగ్ జరగనుంది. 23న ఫలితాలు వెలువడనున్నాయి. మరోవైపు, దేశ వ్యాప్తంగా 10 రాష్ర్టాల్లోని 31 అసెంబ్లీ సీట్లకు, కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానానికి కూడా బుధవారం ఉప ఎన్నికలు జరిగాయి. వయనాడ్లో 65 శాతం, అసెంబ్లీ ఉప ఎన్నికల్లో 55 నుంచి 90 శాతం పోలింగ్ నమోదైంది.