ముంబై: మహారాష్ట్రలోని ఓ జ్వలరీ షాపు(Jewellery Shop)లో ముగ్గురు దొంగలు చోరీకి పాల్పడ్డారు. బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు ధరించిన ఆ దుండగలు పట్టపగలే దొంగతనం చేశారు. ఫాల్గర్లో ఉన్న లక్ష్మీ జ్వలర్స్ షాపులో ఈ ఘటన జరిగింది. షాపులో ఉన్న లక్షల ఖరీదైన నగలను ఎత్తుకెళ్లారు. తమ వద్ద ఉన్న నాటు తుపాకీలతో గాలిలో కాల్పులు జరిపారు. ఈ ఘటనకు చెందిన మొబైల్ వీడియో వైరల్ అవుతోంది. సోమవారం సాయంత్రం 4.30 నిమిషాలకు ఈ చోరీ జరిగింది. ఓ మోటరుసైకిల్‌పై ఆ ముగ్గురూ షాపు వరకు వచ్చారు. షాపులోకి ప్రవేశించి అందులో ఉన్న ఉద్యోగుల్ని బెదిరించారు. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కానీ వాళ్లు పరారీ అయ్యారు. దొంగల కోసం గాలింపు చేపట్టారు.
Three masked men armed with firearms stormed a jewellery showroom in Maharashtra’s Palghar, held employees and customers at gunpoint, looted gold ornaments and cash, and escaped on a motorcycle.
The robbery took place around 4.30 pm on Monday at Lakshmi Jewellers on the busy… pic.twitter.com/horfXtn4YS
— Vani Mehrotra (@vani_mehrotra) July 21, 2026