న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: యమహా మోటర్స్ మళ్లీ స్పోర్ట్స్ బైకుల సెగ్మెంట్లోకి అడుగుపెట్టబోతున్నది. దేశీయంగా స్పోర్ట్స్ బైకులకు పెరుగుతున్న గిరాకీని దృష్టిలో పెట్టుకుని సంస్థ 250 సీసీ నుంచి 1000 సీసీ సామర్థ్యంతో కూడిన బైకులను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు యమహా ఇండియా చైర్మన్ హజిమే ఓటా తెలిపారు. ఇటీవల దేశీయ మార్కెట్లోకి 200 సీసీ ఇంజిన్ కలిగిన ఆర్2 మాడల్‌ను విడుదల చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో తనెరా 700, ఎక్స్ఎస్ఆర్900, ఎంటీ-07, ఎంటీ-09, ఆర్3, ఆర్7, ఆర్9 మాడళ్లను తీసుకొచ్చిన సంస్థ..భవిష్యత్తులో వీటిని భారత మార్కెట్లో విడుదల చేయాలనుకుంటున్నట్టు ఆయన చెప్పారు.
వీటిలో గతేడాది జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఆర్7, తనెరా 700 మాడళ్లను ప్రదర్శించిన విషయం తెలిసిందే. తనెరా 700 మాడల్‌ను రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయ 750కి పోటీగా సంస్థ ఈ బైకును తీసుకొస్తున్నది. అడ్వాన్స్డ్ ఫీచర్‌తో తీర్చిదిద్దిన ఈ బైకు లీన్-సెన్సిటివ్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, ైస్లెడ్ కంట్రోల్ సిస్టమ్, వైసీసీ-టీ ఎలక్ట్రానిక్ వంటి ఫీచర్స్ కలిగిన ఈ బైకు 689 ఈసీ ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో తయారు చేసింది.