Naresh Goyal | మనీలాండరింగ్ కేసులో జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ అరెస్ట్
కెనరా బ్యాంకును మోసంచేసిన కేసులో జెట్ ఎయిర్వేస్ (Jet Airways) వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్‌ను (Naresh Goyal) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు అరెస్టు చేశారు. అంతకుముందు ముంబైలోని ఈడీ ఆఫీస్‌లో ఆయనను సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు అనంతరం అదుపులోకి తీసుకున్నారు.
ముంబై: కెనరా బ్యాంకును మోసంచేసిన కేసులో జెట్ ఎయిర్వేస్ (Jet Airways) వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్‌ను (Naresh Goyal) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు అరెస్టు చేశారు. అంతకుముందు ముంబైలోని ఈడీ ఆఫీస్‌లో ఆయనను సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు అనంతరం అదుపులోకి తీసుకున్నారు. శనివారం ఉదయం పీఎంఎల్ఏ (PMLA) కోర్టులో హాజరుపరుచనున్నారు. కేనరా బ్యాంకును (Canara Bank) రూ.538 కోట్ల మేర మోసం చేసినట్లు సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తున్నారు. మే 5న ముంబైలోని (Mumbai) ఏడు ప్రాంతాల్లో సీబీఐ అధికారులు తనిఖీలు చేసిన విషయం తెలిసిందే.
మోసం, నేరపూరిత కుట్ర, నేరపూరిత విశ్వాస ఉల్లంఘన, నేరపూరిత దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని పేర్కొంటూ నరేశ్ గోయల్, అనితా గోయల్, గౌరంగ్ ఆనంద శెట్టి తదితరులపై గతేడాది నవంబర్ 11న సీబీఐకి కెనరా బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ పీ సంతోష్ ఫిర్యాదు చేశారు. దీనివల్ల బ్యాంకుకు రూ.538.62 కోట్ల నష్టం వాటిల్లిందని ఆరోపించారు.
జెట్ ఎయిర్వేస్ నేలకు పరిమితమైన తర్వాత 2019 మే 25న విదేశాలకు బయలుదేరి వెళ్లేందుకు నరేష్ గోయల్, ఆయన అనితా గోయల్ ప్రయత్నించారు. ముంబై విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు విమానం ఎక్కడానికి అనుమతి నిరాకరించారు. నరేశ్ గోయల్ దంపతులు నాలుగు భారీ సైజ్ సూట్ కేసులతో విదేశాలకు వెళ్లేందుకు సిద్ధం కావడం గమనార్హం.
విదేశీ విమాన సర్వీసుల సంస్థ ‘ఎతిహాద్’కు వాటాల విక్రయ ఒప్పందం విషయంలో విదేశీ మారక ద్రవ్యం యాజమాన్య సంస్థ (ఫెమా) నిబంధనలను నరేష్ గోయల్ ఉల్లంఘించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. దీంతో ముంబై, ఢిల్లీల్లోని ఆయన నివాసాలు, కార్యాలయాలపై 2019 సెప్టెంబర్ లో తనిఖీలు చేశారు. 2020లో నరేశ్ గోయల్‌ని ఈడీ అధికారులు పలు దఫాలు ప్రశ్నించారు.
దాదాపు 25 ఏండ్ల పాటు నిరంతరాయంగా విమాన సేవలు నిర్వహించిన జెట్ ఎయిర్వేస్.. భారీ నష్టాలతో.. సర్వీసుల నిర్వహణకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో విఫలం కావడంతో 2019 ఏప్రిల్‌లో మూత పడింది. తర్వాత బ్యాంకులు నిర్వహించిన వేలంలో జలాన్ కల్రాక్ కన్సార్టియం.. జెట్ ఎయిర్వేస్ సంస్థ బిడ్ సొంతం చేసుకున్నది. ఇంకా జలాన్ కల్ రాక్ కన్సార్టియం ఆధ్వర్యంలో జెట్ ఎయిర్వేస్ విమాన సర్వీసులు ప్రారంభం కావాల్సి ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Canara Bank
- cbi
- ED
- jet airways
RELATED ARTICLES
తాజా వార్తలు
Allu Aravind | అల్లు సినిమాస్‌లో టికెట్ల బ్లాకింగ్‌పై ప్రేక్షకుల ఆగ్రహం.. వెంటనే వీడియో కాల్ చేసిన అల్లు అరవింద్,అక్కడికక్కడే కీలక నిర్ణయం!
Salman Khan | చిరంజీవి, వెంకటేశ్, రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమాల్లో ఛాన్స్ ఇస్తే రెడీ.. టాలీవుడ్ హీరోలపై సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Priyanka Arul | ఓజీ హీరోయిన్ ప్రియాంక మోహన్ సాహసం.. అంధురాలిగా కొత్త అవతారం,బర్త్‌డే పోస్టర్‌తో ఆసక్తి పెంచిన మేకర్స్!
బాలిలో 50 అడుగుల గణేశుడు.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు
Raaka | అల్లు అర్జున్ ‘రాకా’ మ్యూజిక్ డైరెక్టర్‌కు షాక్.. ధనుష్ ‘ఓం’తో సాయి అభ్యంకర్‌పై విమర్శలు!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

