పాట్నా: ఎమ్మెల్యే ఒకరు తన వద్ద ఉన్న పిస్టల్‌ను బహిరంగంగా ప్రదర్శించారు. దీని గురించి ప్రశ్నించిన మీడియా సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీహార్‌లో ఈ సంఘటన జరిగింది. జేడీ(యూ) ఎమ్మెల్యే గోపాల్ మండల్ (JD(U) MLA Gopal Mandal) మంగళవారం సాయంత్రం భాగల్పూర్లోని జవహర్లాల్ నెహ్రూ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు వచ్చారు. ఈ సందర్భంగా గన్ను చేతిలో పట్టుకుని అందరికీ కనిపించేలా ప్రదర్శించారు. ఇది చూసి అక్కడున్న కొందరు భయాందోళన చెందారు.
కాగా, శుక్రవారం మీడియా సమావేశం సందర్భంగా ఎమ్మెల్యే గోపాల్ మండల్ గన్ చూపడాన్ని కొందరు రిపోర్టర్లు ప్రశ్నించారు. దీంతో ఆయన వారిపై మండిపడ్డారు. ‘ఇంకా నా వద్ద పిస్టల్ ఉంది. మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు? ఆ రోజు నా బెల్ట్ మిస్ అయ్యింది. నడుము వద్ద ఉంచుకున్నప్పటికీ అది జారిపోయింది. మీరు జర్నలిస్టులా? నేను పిస్టల్‌ను పట్టుకున్నా. అయితే ఏంటి? మీరు నా తండ్రా? దూరంగా వెళ్లండి’ అంటూ మీడియా సిబ్బందిని దుర్భాషలాడారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
I still have the pistol with me. What do u want to say? Had missed my belt and kept it in my waist but it slipped. Are you guys journalists? Yes, I will wave the pistol. Are you guys my father? Go away. (Abuses). @Jduonline MLA #GopalMandal pic.twitter.com/9U8cR8Bixc
— Anand Singh (@Anand_Journ) October 6, 2023