Allu Ayaan | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చిన్న వయసులోనే సోషల్ మీడియాలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న అయాన్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అల్లు ఫ్యామిలీ నుంచి ఎవరైనా బయటకు వస్తే ఎలా వైరల్ అవుతారో.. అయాన్ విషయంలో అది మరింత స్పష్టంగా కనిపిస్తుంది. అయాన్ కనిపించాడంటే చాలు, ఏదో ఒక సరదా పనితో లేదా క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో నెటిజన్లను అలరిస్తూ ట్రెండింగ్‌లోకి వచ్చేస్తుంటాడు.అందుకే అభిమానులు సరదాగా అయాన్‌ను “మోడల్ అయాన్” అని పిలుచుకుంటారు.
అతడి స్టైల్, ఎక్స్ప్రెషన్స్, కెమెరా ముందు ఉండే కాన్ఫిడెన్స్ చూసి ఈ పేరు అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. చిన్న చిన్న వీడియోలతోనే పెద్ద ఎత్తున ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం అయాన్ స్పెషాలిటీగా మారింది. ఇటీవల క్రిస్మస్ సందర్భంగా అయాన్ మరోసారి సోషల్ మీడియాను షేక్ చేశాడు. క్రిస్మస్ ట్రీ దగ్గర నిలబడి, క్రిస్మస్ సాంగ్‌కు సరదాగా రీల్ చేయగా, ఆ వీడియోను అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది. అంతే.. క్షణాల్లో ఆ వీడియో వైరల్ అయిపోయింది. ఆ రీల్లో అయాన్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్, చూడముచ్చటైన డాన్స్ మూమెంట్స్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. పిల్లల సహజమైన ఆనందం, నిరాడంబరమైన నటన చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. “మోడల్ అయాన్ మళ్లీ వచ్చేశాడు”, “స్టార్ కిడ్ అయినా సింపుల్‌గా ఎంత క్యూట్‌గా ఉన్నాడు” అంటూ కామెంట్ల వర్షం కురుస్తోంది.
అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సాధారణ నెటిజన్లు కూడా ఈ వీడియోను షేర్ చేస్తూ క్రిస్మస్ స్పెషల్ ఎంటర్టైన్మెంట్గా ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తానికి మరోసారి అల్లు అయాన్ తన క్యూట్ అటిట్యూడ్‌తో సోషల్ మీడియాను గెలిచేశాడని చెప్పొచ్చు. భవిష్యత్తులో ఈ ‘మోడల్ అయాన్’ ఎలాంటి సర్ప్రైజ్లు ఇస్తాడో చూడాలి.