పాట్నా: బీహార్‌లోని అధికార పార్టీ జేడీయూ నేత ధర్మేంద్ర కుమార్‌పై గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపారు. గురువారం పాట్నాలోని ఫుల్వారీ షరీఫ్ ప్రాంతంలో పట్టపగలు ఈ ఘటన జరిగింది. వివాదాస్పద ప్లాట్‌ను సందర్శించేందుకు వచ్చిన ధర్మేంద్ర కుమార్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. భుజానికి స్వల్ప గాయాలు కావడంతో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందారు. అనంతరం ఈ ఘటనపై మీడియాతో మాట్లాడారు. గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో తనపై కాల్పులు జరిపారని చెప్పారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.