చెన్నై: తమిళనాడులోని మధురైలో ఐకానిక్ ఆర్చ్ కూలివేతలో అపశృతి జరిగింది. (Madurai arch collapses) ఆర్చ్ స్తంభం కూలి పడటంతో జేసీబీ డ్రైవర్ మరణించాడు. కాంట్రాక్టర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 1981లో 5వ ప్రపంచ తమిళ సదస్సు జ్ఞాపకార్థం నాటి ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) ప్రభుత్వం మధురైలోని మట్టుతవాని బస్టాండ్ వద్ద ఐకానిక్ ఆర్చ్‌ను నిర్మించింది. అయితే నగరం విస్తరించడంతో రోడ్డు విస్తరణకు ఇది అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్‌లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ప్రత్యామ్నాయ పరిష్కారం సాధ్యం కాకపోతే ఆ ఆర్చ్‌ను కూల్చివేయాలని కోర్టు ఆదేశించింది.
కాగా, హైకోర్టు ఆదేశాల మేరకు బుధవారం రాత్రి ఐకాన్ ఆర్చ్ కూల్చివేత పనులు చేపట్టారు. ఈ నేపథ్యంలో పిల్లర్ విరిగి జేసీబీని ఆపరేట్ చేస్తున్న డ్రైవర్‌పై కూలింది. దీంతో దాని కింద నలిగి అతడు మరణించాడు. కాంట్రాక్టర్ తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని జేసీబీ ఆపరేటర్ మృతదేహాన్ని బయటకు తీశారు. గాయపడిన కాంట్రాక్టర్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఈ షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#Tamilnadu #Madurai: Crane operator killed in accident while removing decorative memorial arch pic.twitter.com/uwW6UmehYw
— Siraj Noorani (@sirajnoorani) February 13, 2025
மதுரை மாட்டுத்தாவணியில் உள்ள தோரணவாயிலை இடிக்கும்போது பொக்லைன் மீது தூண் விழுந்ததில் ஆபரேட்டர் உயிரிழப்பு#Madurai | #Accident pic.twitter.com/0c2PoPXDyF
— DD Tamil News (@DDTamilNews) February 13, 2025