Javed Akhtar | ముంబై : పాకిస్థాన్ లేదా నరకం, ఈ రెండిటిలో ఏదో ఒకదానిని ఎంచుకోవలసిన పరిస్థితి వస్తే, తాను నరకానికి వెళ్లడానికే ఇష్టపడతానని బాలీవుడ్ పాటల రచయిత, స్క్రీన్ రైటర్ జావేద్ అక్తర్ అన్నారు. శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో శనివారం రాత్రి ఆయన మాట్లాడారు. భారత్, పాక్‌లలోని అతివాదులు తనపై రోజూ దూషణల వర్షం కురిపిస్తారన్నారు.
‘నువ్వు కాఫిర్ (అవిశ్వాసి) అని ఓ వర్గంవారు, ‘జీహాదీ, పాకిస్థాన్‌కు పో’ అని మరొక వర్గం వారు అంటారని, పాకిస్థాన్ లేదా నరకం, వీటిలో ఏదో ఒకదానిని ఎంచుకోవాలంటే, నేను నరకానికే ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు.