టోక్యో : జైలర్ మూవీలో కావాలా సాంగ్‌కు తమన్నా ఇచ్చిన హాట్ మూమెంట్స్, క్రేజీ స్టెప్స్ హోరెత్తిస్తున్నాయి. ఈ సాంగ్ సీక్వెన్స్‌లో తమన్నా లుక్ కూడా ఆకట్టుకుంటోంది. రజనీకాంత్‌తో కలిసి మిల్కీబ్యూటీ ఆడిపాడిన ఈ సాంగ్ సోషల్ మీడియాలోనూ ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ క్రేజీ నెంబర్‌కు స్టైలిష్ మూమెంట్స్‌తో పలువురు సోషల్ మీడియా యూజర్లు తమ వీడియోలను (Viral Pic) నెట్టింట అప్లోడ్ చేస్తున్నారు.
ఇక లేటెస్ట్ వీడియోలో ఇద్దరు డ్యాన్సర్లు కావాలా సాంగ్‌కు ఐకానిక్ టోక్యో స్టేషన్ ఎదురుగా డ్యాన్స్‌తో హోరెత్తించారు. హుక్ స్టెప్స్‌ను ఎంతో ఈజ్‌తో వారు పెర్ఫామ్ చేయడం నెటిజన్లను ఆకట్టుకుంది. మగువల మూమెంట్స్‌ను నెటిజన్లు ప్రశంసిస్తూ లవ్లీ, సూపర్బ్, అమేజింగ్ పెర్ఫామెన్స్ అంటూ ప్రశంసించారు. జైలర్ సాంగ్‌లో తమన్నా డ్యాన్స్‌కు ఇంటర్నెట్ ఫిదా అయింది.
Read More :