Holi | తలపై గుడ్డు కొట్టి, బలవంతంగా రంగులు పూసి.. హోలీ పండుగ వేళ ఢిల్లీలో జపాన్ యువతికి వేధింపులు
హోలీ (Holi) పండుగ రోజున దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) దారుణం చోటుచేసుకున్నది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ జపాన్‌కు చెందిన ఓ యువతిని (Japanese Woman) చుట్టుముట్టిన యువకులు వేధింపులకు గురిచేశారు.
న్యూఢిల్లీ: హోలీ (Holi) పండుగ రోజున దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) దారుణం చోటుచేసుకున్నది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ జపాన్‌కు చెందిన ఓ యువతిని (Japanese Woman) చుట్టుముట్టిన యువకులు వేధింపులకు గురిచేశారు. ఆమెను గట్టిగా పట్టుకుని రంగులు పూసి, తలపై గుడ్డు కొట్టారు (Egg Smashed). వారిని వదిలించుకుందామని ఆమె ప్రయత్నించినప్పటికీ.. ఒకరి తర్వాత మరొకరు హోలీ, హోలీ అంటూ అరుస్తూ బలవంతంగా ఆమెకు రంగులు పూశారు.
ఎలాగోలా వారి చేతుల నుంచి తప్పించుకుని వెళ్తున్న ఆమెకు మరో యువకుడు అడ్డొచ్చాడు. దీంతో అతని చెంప ఛెళ్లుమనించింది. అయినా అతడు ఆమె మొహంపై రంగుపూశాడు. చివరికి అక్కడినుంచి ఆమె బయటపడింది. ఇదంతా తమ ఫోన్లలో బంధించిన కొందరు.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడిది తెగ వైరల్ అవుతున్నది.
This is so painful to watch! I don't understand what "sanskar" parents pass on to their boys – this is just disgusting behaviour. https://t.co/OLHbNpBh0j
— Yogita Bhayana योगिता भयाना (@yogitabhayana) March 10, 2023
అమ్మాయి పట్ల యువకులు వ్యవహరించిన తీరును కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. వారిని వెంటనే అరెస్టు చేయాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు.
This is so painful to watch! I don't understand what "sanskar" parents pass on to their boys – this is just disgusting behaviour. https://t.co/OLHbNpBh0j
— Yogita Bhayana योगिता भयाना (@yogitabhayana) March 10, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Delhi
- Egg Smashed
- Harasment
- Holi
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

