Salaar 2 | ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. సలార్ 2 సెట్స్‌పైకి వెళ్లేది అప్పుడే..!
Salaar 2 | ప్రభాస్ (Prabhas) టైటిల్ రోల్లో వస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ సలార్. ప్రభాస్ ఫ్యాన్స్‌తోపాటు మూవీ లవర్స్ సీక్వెల్ ప్రాజెక్ట్ సలార్ 2 (Salaar 2) ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
Salaar 2 | ప్రభాస్ (Prabhas) టైటిల్ రోల్లో వస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ సలార్. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రెండు పార్టులుగా వస్తోండగా.. ఇప్పటికే సలార్ పార్టు 1 గ్రాండ్‌గా విడుదలై నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఇక ప్రభాస్ ఫ్యాన్స్‌తోపాటు మూవీ లవర్స్ సీక్వెల్ ప్రాజెక్ట్ సలార్ 2 (Salaar 2) ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
సలార్ 2 సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సర్వం సిద్దమైంది ప్రశాంత్ నీల్ టీం. తాజా టాక్ ప్రకారం సలార్ 2 షూటింగ్ మే చివరలో షురూ కానుంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుందని ఇన్సైడ్ టాక్. నెట్టింట చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం సలార్ 2 షూటింగ్ రామోజీఫిలిం సిటీలో షూటింగ్ మొదలు కానుంది.. తొలి షెడ్యూల్ 10 రోజులపాటు కొనసాగనుండగా.. ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమారన్‌పై వచ్చే సన్నివేశాలను ఈ షెడ్యూల్లో షూట్ చేయనున్నారని తెలుస్తోంది.
ప్రశాంత్ నీల్ టీం ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం సలార్ 2 షూట్ పూర్తి చేసి 2025 డిసెంబర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. సీక్వెల్లో టాప్ యాక్టర్లు కనిపించబోతున్నారట. ఇంతకీ సీక్వెల్లో ప్రశాంత్ నీల్ ఎవరెవరినీ తీసుకుంటాడనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. లీడింగ్ ప్రొడక్షన్ హౌజ్ హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సలార్ 2 షూటింగ్ షురూ అవడం ఖాయమైనట్టేనని తెలియడంతో ఆనందంలో ఎగిరి గంతేస్తున్నారు అభిమానులు.
OFFICIALLY CONFIRMED:#Salaar2 Shooting to start from may end. Be ready for the Rebellious announcement. 🥵💥🔥🔥🔥 #Prabhas #Salaar pic.twitter.com/Cs71WxKTXu
— Hail Prabhas (@HailPrabhas007) May 5, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

