Bernard Hill | ‘టైటానిక్’ నటుడు బెర్నార్డ్ హిల్ కన్నుమూత
Bernard Hill | ప్రముఖ నటుడు బెర్నార్డ్ హిల్ (79) కన్నుమూశారు. టైటానిక్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ సినిమాలతో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన ఆయన ఆదివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచినట్లు ఆయన ఏజెంట్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆస్కార్ గెలుచుకున్న టైటానిక్ మూవీలో బెర్నార్డ్ నౌక కెప్టెన్ ఎడ్వర్డ్ స్మిత్ అనే పాత్రను పోషించారు.
Bernard Hill | ప్రముఖ నటుడు బెర్నార్డ్ హిల్ (79) కన్నుమూశారు. టైటానిక్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ సినిమాలతో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన ఆయన ఆదివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచినట్లు ఆయన ఏజెంట్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆస్కార్ గెలుచుకున్న టైటానిక్ మూవీలో బెర్నార్డ్ నౌక కెప్టెన్ ఎడ్వర్డ్ స్మిత్ అనే పాత్రను పోషించారు. లార్డ్ ఆఫ్ ది రింగ్స్ సినిమాలో రోహన్ రాజు థియోడెన్‌గా ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. లార్డ్ ఆఫ్ ది రింగ్స్‌కు పీటర్ జాక్సన్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
కెరీర్ ప్రారంభంలో బీబీసీలో ప్రసారమైన బాయ్స్ ఫ్రం బ్లాక్‌స్టఫ్ ఆయనకు గుర్తింపును తీసుకువచ్చింది. 1982 నాటి బ్రిటీష్ టీవీ మినీ సిరీస్ క్లాసిక్‌గా నిలిచింది. అలాగే, పలు వార్డులు సైతం తెచ్చిపెట్టింది. తాజాగా, ఆయన మోర్గన్ ఫ్రీమెన్‌తో కలిసి బీబీసీలో మరో టెలివిజన్ సిరీస్‌లో నటించారు. ‘ది రెస్పాండర్’ సెకండ్ సిరీస్ ప్రారంభమైన రోజునే ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ సీరిస్‌లో షో స్టార్ మార్టిన్ ఫ్రీమాన్ తండ్రిగా నటించాడు. ఆయన మృతికి పలువురు నివాళులర్పించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rythu Garjana | గులాబీ ఫుల్ ఖుష్.. కేటీఆర్ ‘రైతు గర్జన’కు సునామీలా తరలివచ్చిన అశేషజనం
Delimitation Bill | ఈ నెలాఖరులో డీలిమిటేషన్ బిల్లు.. అమిత్‌షా కీలక సంకేతాలు
Cyclone Alert | మరో తుపాన్ ముప్పు.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన
Promotions Scam | నర్సింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రమోషన్లలో వసూళ్ల దందా.. ఒక్కొక్కరి నుంచి రూ.50 వేలు?
Bharat Summit | కార్మికుల నెత్తురుతో.. సమ్మిట్ సోకులు.. భారత్ సమ్మిట్‌కు ఖర్చు చేసే సొమ్ములో మేజర్ వాటా కార్మిక సంక్షేమ బోర్డుదే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

