ఒమిక్రాన్ వ్యాప్తి : విదేశీ సందర్శకులపై జపాన్ నిషేధం

టోక్యో : కరోనా తాజా వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపధ్యంలో విదేశీ సందర్శకుల రాకను నిషేధిస్తూ జపాన్ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ప్రధాని ఫుమియో కిషిద వెల్లడించారు. విదేశీ విద్యార్ధులు, కార్మికులు, స్వల్పకాలిక వాణిజ్య సందర్శకుల కోసం ఈ నెల ప్రధమార్ధంలో సరిహద్దు నియంత్రణలను సడలించిన జపాన్ తాజాగా సరిహద్దు నియంత్రణలను పునరుద్ధరించింది.
ఈ వారాంతంలో దక్షిణాఫ్రికా సహా ఎనిమిది ఇతర దేశాల నుంచి వచ్చే వారికి ప్రభుత్వ కేంద్రాల్లో పది రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని నియంత్రణలు విధించింది. మరోవైపు ఒమిక్రాన్ కట్టడికి పలు దేశాలు ట్రావెల్ బ్యాన్ విధించడాన్ని డబ్ల్యూహెచ్ఓ తప్పుపట్టింది. శాస్త్రీయంగా అధ్యయనం చేసిన తర్వాత అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనలకు అనుగుణంగా ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాలని, నూతన వేరియంట్ గురించి పూర్తి వివరాలను మదింపు చేసేందుకు సమయం పడుతుందని పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Covid-19
- Japan
- omicron
- Travel ban
RELATED ARTICLES
తాజా వార్తలు
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

